15 ఎకరాలు రాసిచ్చినా తల్లిదండ్రులను వేధిస్తున్న CI.. డీజీపీకి వృద్ధ దంపతుల కంప్లైంట్

by Rajesh |   ( Updated:2024-08-06 04:55:39.0  )
15 ఎకరాలు రాసిచ్చినా తల్లిదండ్రులను వేధిస్తున్న CI.. డీజీపీకి వృద్ధ దంపతుల కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్ : రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి దారి తప్పాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులపై ఆస్తి కోసం వేధింపులు కొనసాగిస్తున్నాడు. కన్న తల్లిదండ్రులు తనకు 15 ఎకరాల భూమి రాసిచ్చినా ఇంకా భూమి రాసివ్వాలని వారిని వేధించసాగాడు. వనపర్తి జిల్లా నల్లా ఘణపురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

తనకున్న 30 ఎకరాల భూమిని తల్లిదండ్రులు కొడుకులకు చెరి సమానంగా పంచి ఒక్కొక్కరికి 15 ఎకరాలు రాసిచ్చారు. రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్-2లో సీఐగా పనిచేస్తు్న్న నాగేశ్వర్ రెడ్డి మరింత భూమి రాసివ్వాలని దూషించడంతో పాటు దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీకి కంప్లైంట్ చేశారు. సీఐ అయిన పెద్ద కుమారుడి వేధింపులు తాళలేక చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. కుమారుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని డీజీపీని వృద్ధ దంపతులు వేడుకున్నారు.

Advertisement

Next Story