కొండెక్కిన కోడిగుడ్డు.. రాష్ట్రంలో అమాంతంగా పెరిగిన గుడ్ల ధరలు

by Satheesh |   ( Updated:2022-12-03 15:15:25.0  )
కొండెక్కిన కోడిగుడ్డు.. రాష్ట్రంలో అమాంతంగా పెరిగిన గుడ్ల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోడి గుడ్ల ధరలు అమాంతం ఒక్కసారిగా పెరిగాయి. కేవలం పది రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ.80కి చేరింది. రాష్ట్రంలో ఏడాది నుండి డజను గుడ్ల ధర రూ. 65 నుండి రూ.70 మధ్య ఉండగా.. కేవలం ఈ పది రోజుల్లోనే డజను గుడ్ల ధర రూ.80కి చేరడం గమనార్హం. దీంతో ఒక్క గుడ్డు ధర రూ.7కి చేరుకుంది. ఉత్పత్తి తగ్గడం, కార్తీక మాసం అయిపోవడం, విరివిరిగా గుడ్ల వినియోగం పెరగడంతోనే ధరలకు అమాంతం రెక్కలు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. కాగా, కోడి గుడ్ల ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో గుడ్డు తినాలంటే జనం ఆలోచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed