ఇఫ్లూ వర్సిటీలో లైంగిక వేధింపులు.. క్యాంపస్‌లో ఉద్రిక్తత

by GSrikanth |
ఇఫ్లూ వర్సిటీలో లైంగిక వేధింపులు.. క్యాంపస్‌లో ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఓయూ సమీపంలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ (ఇఫ్లూ)లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇఫ్లూలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇఫ్లూ వీసీకి వ్యతిరేకంగా.. లైంగిక వేధింపుల బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ నిరాహార దీక్షకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. నిరాహార దీక్షకు కూర్చున్న స్టూడెంట్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు పలువురు విద్యార్థులను పోలీసులు ఆదుపులోకి తీసుకోని స్థానిక పీఎస్‌కు తరలించారు.

Advertisement

Next Story