భారీ వర్షాల ఎఫెక్ట్.. బోగ‌త జ‌ల‌పాతం సందర్శన బంద్

by Mahesh |   ( Updated:2024-08-31 14:12:06.0  )
భారీ వర్షాల ఎఫెక్ట్.. బోగ‌త జ‌ల‌పాతం సందర్శన బంద్
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. దీంతో తెలంగాణ న‌య‌గార జ‌ల‌పాతంగా పేరుగాంచిన బోగ‌త జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో భారీ వర్షం కురవగా రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు.. వాతావరణ శాఖ వరగంల్, ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో బోగత జలపాతం సందర్శనను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు వాజేడు అట‌వీశాఖ రేంజ్ అధికారులు తెలిపారు. అలాగే వర్షాలు తగ్గుముఖం పట్టి జలపాతం శాంతించిన తర్వాత పర్యాటకులకు సంద‌ర్శన‌కు వెళ్లడానికి అనుమతిస్తామని అటవీ అధికారులు తెలిపారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు, పర్యటకులు అర్థం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story