Current Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ

by Gantepaka Srikanth |
Current Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు(Current Charges Hike In Telangana) ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే 10 నుంచి 50 శానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదన చేశాయి. సుదీర్ఘ చర్చల అనంతరం డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ(ERC) తిరస్కరించింది. కాగా, ఇటీవల రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు(Electricity distribution companies) ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నెలకు 800 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల కరెంటు వాడితే స్థిరఛార్జీని రూ.10 నుంచి రూ.50 పెంచాలని తెలిపాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్‌సీకి తాజాగా నివేదికను అందజేశాయి. పరిశీలన అనంతరం పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది.

Advertisement

Next Story

Most Viewed