- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Buzz words : బజ్ వర్డ్స్ భలే.. భలే.. ! వాళ్ల మాటలకు అర్థాలే వేరు లే!!
దిశ, ఫీచర్స్ : మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కొందరు ప్రతీ మాటకు ముందో తర్వాతో ‘‘ అయితే, ఇకపోతే, ఇంకేంటంటే.. సో, అలా, అవును మరి’’ వంటి పదాలను వాడుతారు. ఇలా సపోర్టివ్‌గా వాడేవాటిని ఊతపదాలు, వ్యర్థ పదాలు అనికూడా అంటారు నిపుణులు. అంటే అవి వాడకపోయినా పెద్ద నష్టమేమీ జరగదు. కానీ వాడితేనే మజా ఉంటుంది. అలాగే ప్రస్తుతం కాలేజీ క్యాంపస్‌లలో, కార్పొరేట్ సెక్టార్ట్‌లోనూ తరచుగా కొన్ని ‘బజ్ వర్డ్స్’ ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా వినేవారికి ఇవి అంత ఈజీగా అర్థం కాదు. పైగా గజిబిజిగా అనిపిస్తాయి. ఒక్కసారి అర్థమయ్యాయో భలే సరదాగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. అలాంటి వర్డ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మాటకారి పాలీమాథ్
నలుగురు కలిసిన చోట సరదా.. సరదా మాటలు సహజంగానే వస్తుంటాయి. అలాగే సమావేశాల్లో, సజ్జెక్ట్స్‌పై డిస్కషన్స్‌లో అందరూ మాట్లాడినా కొందరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటారు. ఎందుకంటే వారికి బోలెడంత అవగాహన ఉంటుంది. కాబట్టి అనర్ఘళంగా మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వ్యక్తిని ‘వాడో పాలీమాథ్ రా’ అంటుంటారు యూత్ పోరగాల్లు. ఇది గ్రీకు భాష నుంచి వచ్చిన పదం. ఒక విషయంపట్ల క్లారిటీతో అర్ఘళంగా మాట్లాడి ఆకట్టుకోవడమే వీరి ప్రత్యేకత.
టెక్నికల్ టెక్ షేమ్
మీరు కంప్యూటర్‌పై బిజీ వర్కులో ఉంటారు. కానీ సెడన్‌గా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. దానిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అయితే మీ పక్కన ఉండే మరో కోలీగ్ మాత్రం ఆ విషయంలో నైపుణ్యం కలిగి ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు వారిని పిలిచి కొంచెం ఏమైందో చూడు బాస్ అన్నారనుకోండి. వాళ్లొచ్చి ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. కానీ వెంటనే ‘ఆ మాత్రం తెలియదా?’ అని స్టైల్‌గా ఓ లుక్కిస్తారు. అదే టెక్ షేమ్ అంటే.. ఒక విధంగా మీరు టెక్నాలజీలో వెనుకబడి ఉన్నారని వెక్కిరించడం అన్నమాట.
వర్క్ ఫ్రమ్ హోమ్ - హుష్ ట్రిప్
ఒకప్పటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా జాబ్స్ అండ్ వర్క్ స్టైల్స్ మారిపోయాయి. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రయారిటీ పెరిగింది. అయితే ఈ తరహా ఎంప్లాయీస్ ఎలాగూ ఇంట్లోనే ఉన్నాం కదా అని సరదాగా బయట ఏ పార్కుకో, లేక టూర్‌కో వెళ్లి అక్కడే ల్యాప్ టాప్‌లో వర్క్ చేద్దాం అనుకుంటారు. అన్నంత పనిచేస్తారు. అంటే యాజమాన్యానికి ఈ విషయం తెలియనివ్వరు. ఈ ట్రప్పునే ‘హుష్ ట్రిప్’ అంటారు. అంటే జాగ్రత పడటం ముఖ్యం ఉద్దేశం.
వర్క్ ఇన్‌ఫ్లుయెన్సర్
ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేక రకాల కంటెంట్‌ను పంచుకుంటారు. ముఖ్యంగా వారు తాము చేసే వృత్తికి సంబంధించిన పనికి సంబంధించిన విషయంలోనే దానిని ఎలా చేయాలి అనేదానిపై సలహాలు ఇస్తుంటారు. పనికి సంబంధించిన పిక్స్, వీడియోస్, టిప్స్ వంటివి తరచుగా షేర్ చేస్తుంటారు. దాని ద్వారా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ రాబడుతుంటారు. వీరినే వర్క్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు.
కష్టకాలంలో గ్లాస్ క్లిఫ్
కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సంక్షోభాలు లేదా కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కువగా తక్కువ జీతానికి పనిచేసేవారిని రిక్రూట్ చేసుకుంటాయి. ఇక్కడ ముఖ్యమైన పదవుల్లోకి మహిళలను మాత్రమే తీసుకోవడాన్ని ‘ఇట్ష్ ఎ గ్లాస్ క్లిఫ్’ అంటున్నారు. కార్పొరేట్ సెక్టార్‌లో ఈ బజ్‌వర్డ్ చాలా ఫేమస్. అట్లనే కష్టకాలంలో ప్రమోషన్లు ఇచ్చిఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ‘ఫెయిల్యూర్’కి దారితీస్తుందనే సందర్భంలో కూడా గ్లాస్ క్లిఫ్ అనే బజ్ వర్డ్ యూజ్ చేస్తుంటారు.