Bhatti Vikramarka : తెలంగాణలో కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర పోస్ట్

by Ramesh N |
Bhatti Vikramarka : తెలంగాణలో కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: Telangana తెలంగాణలో కులగణన ప్రక్రియ వేగవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కులగణనలో తెలంగాణ ఒక మోడల్ అని Bhatti Vikramarka భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల అభిప్రాయానికి పట్టం కడుతామన్నారు. తాజాగా caste census కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం అవ్వడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని Deputy CM తెలిపారు.

BC Welfare బీసీ సంక్షేమం అభ్యున్నతి పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరామ్, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 4-5 తేదీల్లో రాష్ట్రంలో కులాల సర్వే ప్రారంభించి నవంబర్ 30 నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని ponnam prabhakar మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన విషయం తెలిసిందే. సర్వే కోసం 80 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి వారికి తగిన శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed