BJP దత్తపుత్రుడు అదానీ‌పై ఈడీతో విచారణ చేపట్టాలి: CPI

by GSrikanth |   ( Updated:2023-01-28 14:48:07.0  )
BJP దత్తపుత్రుడు అదానీ‌పై ఈడీతో విచారణ చేపట్టాలి: CPI
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ దత్తపుత్రుడు అదానీ కంపెనీల షేర్ల అవకతవకలపై హిండెన్ బెర్గ్ ఇచ్చిన నివేదికపై ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రాథమిక నేరం రుజువైతే తక్షణమే కేంద్రం అదానీ‌ని అరెస్టు చేయాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ ప్రజలలో ఈ అంశాలపై అనుమానాలు నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేయాలని, నరేంద్ర మోడీ ఈ అంశాలపై నైతిక బాధ్యత వహించి ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలన్నారు.

ఈ నివేదిక వెలువడిన తర్వాత వరుసగా రెండు రోజులపాటు అదానీ‌ కంపెనీ షేర్లు, అందులో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ, ఎస్‌బీఐ తదితర సంస్థల షేర్లు నాలుగు లక్షల కోట్లు రూపాయల భారీ పతనం అవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ‌ సంపద అనూహ్య రీతిలో పెరిగి, ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఏగబాకారని, ఇందుకు మోడీ ప్రభుత్వం ప్రోత్సాహం బహిరంగ రహస్యమేనని చెప్పారు. ఇటీవల శ్రీలంకలోని ఒక విద్యుత్ ప్రాజెక్టు, ఆస్ట్రేలియా బొగ్గు గనులను కైవసం చేసుకునేందుకు అదానీ‌ గ్రూపుకు రుణాలు ఇచ్చేందుకు ఎస్‌బీఐ పై కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చిందని, అలాగే అదానీ‌ కంపెనీలలో ఎల్ఐసీ ద్వారా రూ. 81 వేల కోట్లు పెట్టించిందని తెలిపారు.

సంస్థలను బలవంతంగా ఇతరుల నుంచి అదానీ‌ కంపెనీకి ఇప్పించిందని ఆరోపించారు. అదానీ షేర్ల డొల్లతనం బయటపడి, రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్ పతనంతో ఎల్ఐసీ రూ.18 వేల కోట్లు కోల్పోయిందని, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడితే ఏమవుతుందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోందని కూనంనేని తెలిపారు. ఎల్ఐసీ, ఎస్‌బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అదానీ‌ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు తిరిగి స్వాధీనం చేసుకొని ఆయా సంస్థలకు అప్పగించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed