- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ED Notices: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddy)కి బిగ్ షాక్ తగిలింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. గతేడాది జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కళాశాలల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ దాడు(Ed Raids)ల్లో కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేసినట్లు గుర్తించారు. మొత్తంగా రాష్ట్రంలోని పది ప్రయివేటు మెడికల్ కాలేజీ(Medical College)ల్లో 45 సీట్లు బ్లాక్ చేసి అమ్మకున్నట్లు ఈడీ గుర్తించింది. మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరుతూ ఈడీ అధికారులు నోటీసులు అందించారు. కాగా, ఈడీ నోటీసులు మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.