- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ విచారణ షురూ
by Mahesh |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారుల విచారణ మొదలు పెట్టింది. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ అధికారులు వీడియో కెమెరాలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు. లీకేజీ కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మొదటి ఇద్దరు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ప్రత్యేక గదిలో ప్రశ్నించారు. ఎన్ని పేపర్లు తస్కరించారు? ఏయే పేపర్లు? ఎవరెవరికి? ఎంతకు? అమ్మారు? అన్న అంశాలపై ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారింది? ఏ పద్ధతిలో లావాదేవీలు జరిగాయి? అన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నట్లు తెలియవచ్చింది.
Advertisement
Next Story