- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ ఫోకస్.. పూర్తి వివరాలు ఇవ్వాలని ఎండీకి ఈడీ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఇటీవల తేలిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ ఫోకస్ చేసింది. ఏకంగా రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. వందల కోట్ల నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. అలాగే రైతులకు బదులు ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ భారీ కుంభకోణంలో కీలక నిందితులను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ గుండమరాజు కల్యాణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఏసీబీ మొత్తం 10 మందిని అరెస్ట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇద్దరు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. కాంట్రాక్టర్ల ద్వారా నిధులు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ మరోసారి ఫోకస్ చేసింది. పూర్తి వివరాలు ఇవ్వాలని ఎండీకి ఈడీ లేఖ అందించింది.