- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ కన్నీరు పెట్టిన అన్నదాత
దిశ, సైదాపూర్: అకాల వర్షం అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజులు పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు కలవర పడుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దవ్వడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇక రాబోయే మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మండలంలోని సోమారం, లస్మన్నపల్లి, తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లలో పూర్తిగా ధాన్యం తడిసిముద్దైంది. తడిసిన ధాన్యం ఆరడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని, ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.