యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామి వారి దర్శనానికి గంటల సమయం

by Mahesh |
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వామి వారి దర్శనానికి గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్‌లో పోటెత్తారు. దీంతో ఉచిత దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. పెరిగిన భక్తుల దృష్ట్యా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే గుట్ట పైకి వెళ్లే ఉచిత బస్సుల్లో భక్తుల రద్ధీ భారీగా ఉండటంతో చిన్న పిల్లలు మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

స్వర్నగిరి దేవాలయానికి భక్తుల తాకిడి

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొత్తగా నిర్మించిన స్వర్ణ గిరి ఆలయానికి భారీగా సందర్శకులు తాకిడి పెరిగిపోయింది. ముఖ్యంగా సెలవు రోజు, శని ఆదివారాల్లో దాదాపు 50 వేల మంది వరకు ఈ నూతన ఆలయాన్ని సందర్శించుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నగరానికి కేవలం 50 కిలోమీటర్ల లోపు ఉండటంతో యువత ఈ ఆలయాన్ని సందర్శించడానికి భారీగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ ఆలయాన్ని సందర్శించిన తర్వాతే యాదాద్రికి వెళ్తున్నారు.

Advertisement

Next Story