- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదు.. రాజకీయం: MLA Raghunandan Rao
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయం.. డ్రగ్స్ తీసుకున్నంత ఈజీ కాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలెట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నాడా? లేదా? అనే అంశంపై తొలుత క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం వాస్తవం కాదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద తాను డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తే బాగుండేదన్నారు. రోహిత్ రెడ్డి.. అయ్యప్ప మాలలో ఉండి.. అసభ్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన అయ్యప్ప మాల తీసిన తర్వాత అన్నింటికీ సమాధానం చెబుతానని హెచ్చరించారు.
రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఇన్నాళ్లు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు చెందిన ఆస్తుల వివరాలను ప్రకటిస్తానని రఘునందన్ రావు వెల్లడించారు. మీరు కూడా మీ ఆస్తులను ప్రకటిస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. రోహిత్ రెడ్డికి ప్రగతిభవన్ ఆశీస్సులు తప్ప సొంత బలం లేదన్నారు. ఈడీ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక.. తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారన్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తులను ప్రకటించే దమ్ముందా అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను తన ఆస్తులను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గం.. సిద్దిపేట, గజ్వేల్తో పోటీ పడుతోందని, ఈ విషయాన్ని మరిచిపోవద్దని పేర్కొన్నారు.
READ MORE