- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు @ 5,278.. గతేడాదితో పోల్చితే 17.65 శాతం అధికం
దిశ, తెలంగాణ బ్యూరో/సిటీ క్రైం: నూతన సంవత్సర వేడుకల వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్, పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఐదు గంటల వరకు మొత్తం 5,278 కేసులు నమోదు చేశారు. కాగా, గతేడాది 4,486 కేసులు నమోదు కాగా, ఈ సారి 17.65 శాతం కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,415 మంది పట్టుబడగా, ఇందులో 15 మంది మైనర్లు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 518 పట్టుబడగా ఇందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సైబరాబాద్ పరిధిలో 840 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలోనే 2,773 కేసులు నమోదు కావడం గమనార్హం.
గతేడాది గ్రేటర్ పరిధిలో 2,972 కేసులు నమోదు కాగా, ఈ సారి కేసుల సంఖ్య తగ్గింది. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారికి రూ. రెండువేల వరకు చలానా విధించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. రెండోసారి దొరికితే జైకు శిక్ష కూడా పడే అవకాశముందని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయవచ్చని హెచ్చరించారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ లలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వారితో నిండిపోయింది. అయితే ఈ తనిఖీల్లో అత్యధికంగా 550 బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కౌంట్) నమోదు కావడం గమనార్హం. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో అధికంగా 21-30 ఏండ్ల వయస్సు ఉన్న వారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది, ఈ ఏడాది కేసుల వివరాలు ఇలా..
జిల్లా/కమిషనరేట్ 2024 - 2023
హైదరాబాద్ 1,415 - 1,247
సైబరాబాద్ 840 - 1,222
రాచకొండ 518 - 503
వరంగల్ 408 - 281
నల్లగొండ 222 - 129
సంగారెడ్డి 190 - 110
నిజామాబాద్ 164 - 78
సిద్దిపేట 156 - 50
రాజన్న సిరిసిల్ల 136 - 120
జగిత్యాల 109 - 55
మెదక్ 104 - 34
భద్రాద్రి కొత్తగూడెం 100 - 41
రామగుండం 99 - 92
కరీంనగర్ 91 - 55
కామారెడ్డి 85 - 81
సూర్యపేట 85 - 53
మహబూబ్ నగర్ 75 - 42
కొమురంభీం ఆసిఫాబాద్ 73 - 18
ఆదిలాబాద్ 62 - 26
ఖమ్మం 60 - 0
నిర్మల్ 59 - 52
మహబూబాబాద్ 47 - 43
వనపర్తి 46 - 20
నారాయణ పేట 43 - 17
వికారాబాద్ 38 - 40
జోగులాంబ గద్వాల 17 - 19
ములుగు 16 - 0
నాగర్ కర్నూల్ 11 - 18
జయ శంకర్ భూపాలపల్లి 9 - 40
మొత్తం 5,278 - 4,486
హైదరాబాద్‌లో ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్
న్యూ ఇయర్ వేళ టీజీ న్యాబ్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, ఎక్సయిజ్, ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పక్కా ప్రణాళికతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు తనిఖీలు చేశారు. ఈవెంట్స్, ఫాంహౌస్, రిసార్ట్స్, పబ్స్, ఇంకా ఇతర హాట్ స్పాట్స్‌లలో 19 టీమ్ లను రంగంలోకి దింపి డ్రగ్స్ కిట్స్ లతో పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఐదుగురిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
నేను రేవంత్ అన్న తాలూకా..
డిసెంబర్ 31 నైట్ కొందరు మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. హైదరాబాద్‌లో ఓ మద్యం ప్రియుడు అర్ధరాత్రి మందుతాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఫూటుగా మద్యం తాగిన వాహనదారుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ‘నేను రేవంత్ అన్న తాలూకా..’ అంటూ పోలీసులకే ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘రేవంత్ అన్న తాగి రోడ్ల మీదికి రమ్మన్నాడా..? రేవంత్ అన్నను ఎందుకు బద్నాం చేస్తున్నావ్..’ అంటూ సదరు పోలీసు రివర్స్ క్వశ్చన్ వేయడంతో మందుబాబు దిక్కులు చూడటం మొదలు పెట్టాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.