TS: హోటళ్లు, రెస్టారెంట్లలో డ్రింకింగ్ వాటర్ ఫ్రీ

by GSrikanth |
TS: హోటళ్లు, రెస్టారెంట్లలో డ్రింకింగ్ వాటర్ ఫ్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తాగునీటిని తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్‌కు సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ బాటిల్స్ ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story