దోస్త్ స్పెషల్ ఫేజ్.. 12,756 మందికి అలాట్

by Mahesh |
దోస్త్ స్పెషల్ ఫేజ్.. 12,756 మందికి అలాట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఫేజ్ లో 12,756 మందికి సీట్లు అలాట్ అయినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 13,093 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నట్లు తెలిపారు. ఫస్ట్‌ ప్రియారిటీ ఇచ్చిన వారిలో 11,616 మందికి, సెకండ్ ప్రియారిటీలో 1140 మందికి సీట్ అలాట్ అయిందన్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చినా 337 మంది సీటు పొందలేకపోయారని పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 13 నుంచి 16 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని సీటు కన్ఫమ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

లా సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్

లా సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజైంది. ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని లాసెట్ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హుల జాబితాను 22వ తేదీన ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అదే రోజు తప్పుల సవరణకు చాన్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 25న ఎడిట్ కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 30న సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. కాగా విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు చలాన్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా సంబంధిత కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed