Trade License : ట్రేడ్ లైసెన్స్‌లపై GHMC అధికారుల కీలక ప్రకటన

by Bhoopathi Nagaiah |
Trade License : ట్రేడ్ లైసెన్స్‌లపై GHMC అధికారుల కీలక ప్రకటన
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : వ్యాపారులు (Traders) తమ ట్రేడ్ లైసెన్స్‌(Trade License)ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు (Online application) చేసుకోవాలని జీహెచ్ఎంసీ (GHMC) సర్కిల్ 14 ఏఎంఓహెచ్ డాక్టర్ ఎన్.వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది తమ కార్యాలయ సిబ్బంది ట్రేడ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని అధిక మొత్తంలో డబ్బులు అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. తనతో పరిచయాలు ఉన్నాయని, లైసెన్స్‌లు ఇప్పిస్తామని ఎవరైనా సిబ్బంది మీ దగ్గరకు వస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. వీటిల్లో సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిని టర్మినేట్ చేస్తానని హెచ్చరించారు. లైసెన్స్‌లు అవసరం ఉన్న వారు మధ్యవర్తులను నమ్మవద్దని, సిటిజెన్ సర్వీస్ సెంటర్‌(Citizen Service Centre)లో మాత్రమే అప్లై చేయాలన్నారు. కిరాయిదారులైతే రెంటర్ అగ్రిమెంట్, యజమానులైతే ఎంత విస్తీర్ణం ఉందో ధ్రువీకరిస్తూ దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు

Advertisement

Next Story