ఆ ప్రకటనలు నమ్మకండి.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ

by M.Rajitha |
ఆ ప్రకటనలు నమ్మకండి.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 'వన్ స్టేట్- వన్ కార్డ్'(One State - One Card) పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా వన్ స్టేట్-వన్ కార్డ్ అప్లికేషన్లు వఇవే అంటూ సామాజిక మధ్యమాల్లో వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇదే అదనుగా భావించి కొంతమంది అప్లికేషన్లు ఇస్తామని ప్రజల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగులో ఇప్పటివరకు ఎలాంటి అప్లికేషన్లు విడుదల చేయలేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దు అని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో డిజిటల్ కార్డుల వివరాల నమోదు జరుగుతోందని, బయట ఎక్కడ కూడా అప్లికేషన్లు ఇవ్వడం లేదని పేర్కొంది. కాగా గత నాలుగు రోజులుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అప్లికేషన్లు ఇవేనని, వీటిలో వివరాలు నింపి తాహశీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ అప్లికేషన్లు నిజమైనవే అనుకోని చాలామంది మండల రెవెన్యూ ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఈ వ్యవహారం పౌరసరఫరాల శాఖ దృష్టికి రావడంతో.. అలాంటి అప్లికేషన్లు ఏవీ లేవని, వాటిని నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు అని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed