AP Home Minister : సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ హోం మినిస్టర్ భేటీ.. ఎక్స్‌లో ఫోటోలు వైరల్

by Ramesh N |   ( Updated:2024-10-07 15:29:40.0  )
AP Home Minister : సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ హోం మినిస్టర్ భేటీ.. ఎక్స్‌లో ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో ఏపీ హోమ్ మినిష్టర్ అనిత వంగలపూడి భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సోమవారం ఆమె ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నిర్వహించిన సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరపున హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టుల కట్టడికి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ముందు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షాని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఎల్‌డ‌బ్ల్యూఈ స‌ద‌స్సు సందర్భంగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆయా రాష్ట్రాల హోం మంత్రులతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కలిశారు’ అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story