Dipa Karmakar: రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్టిక్ ప్లేయర్ దీపా కర్మాకర్

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-08 12:49:17.0  )
Dipa Karmakar: రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్టిక్ ప్లేయర్ దీపా కర్మాకర్
X

దిశ, వెబ్‌డెస్క్:భారత స్టార్ జిమ్నాస్టిక్(Gymnastic) అథ్లెట్, త్రిపుర(Tripura) రాష్ట్రానికి చెందిన దీపా కర్మాకర్(Dipa Karmakar) రిటైర్మెంట్(Retirement) ప్రకటించింది. గత 25 ఏళ్లుగా ఈ ఆటలో కొనసాగుతున్న దీపా చివరికి గుడ్ బై చెప్పేసింది. తరచూ గాయాల బారిన పడుతుండడంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికైన 'ఎక్స్(X)'లో పోస్ట్ చేసింది. 'నేను చాలా ఆలోచించిన తరువాత, జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం అంత తేలికైన విషయంకాదు. కానీ,రిటైర్ అవ్వడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. నా జీవితంలో చాలా భాగం జిమ్నాస్టిక్స్(Gymnastics)కు కేటాయించానని, దానిలోని ప్రతి క్షణానికి నేను కృతజ్ఞతరాలిని అని తన పోస్ట్ లో పేర్కొంది. నా జీవితంలో ఇప్పటివరకు నేను సాధించిన విజయాలను చూసి చాలా గర్వపడుతున్నాను.అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించడం చాలా ప్రత్యేకం, ముఖ్యంగా రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేయడం నా కెరీర్‌లో మరిచిపోలేని జ్ఞాపకం’ అంటూ చెప్పుకొచ్చింది.తాష్కెంట్‌లో జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన చివరి విజయం తన కెరీర్‌లో కీలక మలుపు' అని పోస్ట్ లో తెలిపింది.

గత 25 సంవత్సరాలుగా నాకు మార్గదర్శకత్వం వహించిన నా కోచ్‌లు బిశ్వేశ్వర్ నంది, సోమకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు లభించిన మద్దతు కోసం త్రిపుర ప్రభుత్వం, జిమ్నాస్టిక్ ఫెడరేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గోస్పోర్ట్స్ ఫౌండేషన్, మెరాకి స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా నా మంచి, చెడు రోజుల్లో ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడ్డ నా కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను రిటైర్ అవుతున్నప్పటికీ, జిమ్నాస్టిక్స్‌తో నా అనుబంధం ఎప్పటికీ వీడిపోదని ఆమె తన పోస్టులో పేర్కొంది.కాగా 31 ఏళ్ల దీపా 2016 రియో ఒలింపిక్స్(Rio Olympics) క్రీడలలో నాలుగో స్థానంలో నిలిచి 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.అలాగే ఒలింపిక్స్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళ జిమ్నాస్టిక్ ప్లేయర్(First woman gymnastic player)గా దీపా రికార్డు నెలకొల్పింది.

Advertisement

Next Story

Most Viewed