పాలమూరులో గెలిచిన డీకే అరుణ మరో రికార్డ్!

by Ramesh Goud |
DK Aruna
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కొత్తగా గెలిచిన ఎంపీలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ కొత్త రికార్డు నమోదు చేశారు. పాలమూరులో గెలిచిన తొలి మహిళా ఎంపీగా డీకే అరుణ రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా నెగ్గిన వారిలో మహిళలు ఎవరు లేరు. మహబూబ్ నగర్ పార్లమెంట్ 1952 లో ఎర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా ఒక్క మహిళా ఎంపీ అభ్యర్ధి కూడా పార్లమెంట్ కు ఎన్నిక కాలేదు.

పాలమూరులో ఎక్కవగా మహిళా ఓటర్లే ఉన్నా.. ఈ స్థానం నుంచి పార్లమెంటుకు వెళ్లిన వారు ఎవరు లేరు. పాలమూరులో ఇప్పటివరకు పలు పార్టీల నుంచి గెలిచిన వారందరూ పురషులే కావడం విశేషం. ఈ సారి ఆ రికార్డును తిరగరాసి పాలమూరు నుంచి పార్లమెంట్ కు వెళ్లిన తొలి మహిళగా డీకే అరుణ ఘనత సాధించారు. డీకే అరుణ 1996లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ 3,33,573 ఓట్లు సాధించి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 5,10,747 ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed