- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్! గాంధీ భవన్‌లో జిల్లాల రివ్యూ మీటింగ్ షురూ
దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలపై ఫోకస్ పెట్టింది. గాంధీభవన్‌లో శనివారం నుంచి జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలపై మీటింగ్ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పటిష్టత, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి అర్హులందరికీ లబ్ధి పొందేలా తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా తొలుత వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపా దాస్‌మున్షీ, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇంచార్జ్‌లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల బాద్యులు, మాజీ ప్రజా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తిరుగులేని విజయం సాధించాలని, ఈ స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.