Disha Effect: దిగొచ్చిన ప్రభుత్వ పెద్దలు.. నీటిగుంతలో కూర్చుని మహిళ నిరసనపై స్పందన

by Ramesh N |
Disha Effect: దిగొచ్చిన ప్రభుత్వ పెద్దలు.. నీటిగుంతలో కూర్చుని మహిళ నిరసనపై స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్- నాగోల్‌లోని ఆనంద్‌నగర్‌లో రహదారులు అధ్వాన్నంగా మారినా ఎవరూ పట్టించుకోవట్లేదని గురువారం రోడ్డు మీద ఉన్న నీటి గుంతలో దిగి ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. ఆ సమస్యపై దిశ పేపర్ గురువారం నాలుగు గంటల డైనమక్ ఎడిషన్‌లో ప్రచురించింది. దీంతో దిశ‌పేపర్ కథనం, ఆమె చేపట్టిన నిరసన వృధా మాత్రం కాలేదు.. వెంటనే నాగోల్ రోడ్ల దుస్థితిపై అధికార యంత్రాంగం కదిలింది.

నగర మేయర్ విజయలక్ష్మి సైతం స్పందించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ అధికారుల సమక్షంలో హూటాహుటిన రోడ్డుపై ఉన్న గుంతలను తాత్కాలికంగా పూడ్చేశారు. ఈ విషయం పై లోకల్ కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎలక్షన్ కోడ్ వల్ల రోడ్డు నిర్మాణం ఆగిందని, అధికారులు కూడా స్పందించి నాగోల్ జంక్షన్ డెవలప్‌మెంట్ కోసం రూ. కోటి 26 లక్షలు రెండు నెలల క్రితమే శాంక్షన్ అయిందని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ పూర్తయిన అనంతరం రోడ్డు వేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story