ఈఎస్ఐ గేటు వద్ద నిర్మించిన ప్రహారీని తొలగించాలంటూ ధర్నా

by Sathputhe Rajesh |
ఈఎస్ఐ గేటు వద్ద నిర్మించిన ప్రహారీని తొలగించాలంటూ ధర్నా
X

దిశ, కాగజ్ నగర్ : పట్టణంలోని ఈఎస్ఐ గేటు వద్ద ఎస్పిఎం యాజమాన్యం నిర్మించిన ప్రహారీగోడను తొలగించాలని పట్టణ ప్రజలు సోమవారం ధర్నా చేపట్టారు. పట్టణ ప్రజలు పోకుండా ఎస్పీఎం యాజమాన్యం గత కొన్ని నెలలుగా రహదారులను మూసివేస్తూ ప్రహారీ గోడలను నిర్మిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడంతో కమిషనర్ అంజయ్య అక్కడికి చేరుకున్నారు. ఎస్‌పి‌ఎం యాజమాన్యంపై చర్యలు తీసుకునేలా చూడాలని ఆందోళన చేశారు. ప్రజలు ఎటు వెళ్లకుండా గోడలు నిర్మించడంతో పట్టణ ప్రజలు ఎటు వెళ్లడానికి వీలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఈఎస్ఐ గేటు వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెట్రోల్ డబ్బా పట్టుకొని నిరసన కారులు ఆందోళన చేపట్టారు. వెంటనే ఎస్‌పి‌ఎం నిర్మించిన అడ్డుగోడను తొలగించాలని మహిళా కౌన్సిలర్లు అక్కడే బైఠాయించారు. పోలీసులు నిరసన కారుల నుండి పెట్రోల్ డబ్బాను లాక్కొని అక్కడే పారబోశారు. దీంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు అగ్గిపుల్లను వేయడంతో ఒక్కసారిగా మంట వ్యాపించింది. దీంతో పోలీసులు వారిని దూరంగా చెదరగొట్టారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

అక్కడే టెంటు వేసి నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. ఎస్‌పి‌ఎన్ యాజమాన్యం పేపర్ మిల్లులో దొంగతనాలు జరుగుతున్నాయంటూ పట్టణంలోని రహదారులకు అడ్డుగోడలు నిర్మించి దారులను మూసివేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత కొన్ని నెలలుగా పలు వార్డులలో ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్ వెన్నె సంగీత, సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్, ముంజం ఆనంద్, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్న కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story