కర్నాటకలో భూ సమస్యలపై ధరణి కమిటీ అధ్యయనం

by Bhoopathi Nagaiah |
కర్నాటకలో భూ సమస్యలపై ధరణి కమిటీ అధ్యయనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్నాటక రాష్ట్రంలో భూ సమస్యలకు అనుసరిస్తోన విధి విధానాలపై ధరణి కమిటీ (Dharani Committee) స్టడీ చేస్తున్నది. బెంగుళూరులో ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, ఉన్నతాధికారులను ధరణి కమిటీ సభ్యులు ఎం.సునీల్ కుమార్, ఎం.కోదండరెడ్డిలు కలిశారు. ప్రధానంగా కర్నాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడతో భూమి సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న భూమి, కావేరీ ప్రాజెక్టులు, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూముల సర్వే తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కర్నాటక చిన్న నీటి పారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజుతోనూ అక్కడి విధానాలపై మాట్లాడారు.

ఆర్వోఆర్ 2024 డ్రాఫ్ట్ లో చేపట్టాల్సిన మార్పులు, చేర్చాల్సిన అంశాలపై స్టడీ చేశారు. అక్కడ విజయవంతంగా అమలవుతున్న అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా 2008 నుంచి ప్రతి లావాదేవీకి తప్పనిసరి చేసిన మ్యాప్ విధానంపై తలెత్తిన సమస్యలు, పరిష్కార మార్గాలపై మాట్లాడారు. జియో రెఫరెన్స్ పద్ధతులు సక్సెస్ గా అమలు చేస్తున్నారు. ఇప్పటికే భూదార్ నంబర్ అక్కడి సిస్టం జనరేట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సారి అనుకున్నప్పటికీ కర్నాటకలో ఇప్పటికే అమలు చేస్తుండడం విశేషం. కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచి అమలు చేసినా దేశంలో రెండో రాష్ట్రంగానే మిగలనున్నది. ఇంకా పలు అంశాలపై కర్నాటక మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించినట్లు ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed