ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
X

దిశ, వెల్గటూర్ : ప్రేమించిన యువతి తనకు దక్కలేదని మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంప ల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేందర్(36) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ యువతికి వేరే యువకుడితో వివాహం అయింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story