- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan: పాక్ మిలిటరీ చెక్ పోస్టుపై ఉగ్రదాడి.. ఏడుగురు సైనికులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: పాక్‌లో మరోసారి ఉగ్రదాడి (Terrar attack) జరిగింది. నైరుతి పాకిస్థాన్‌లోని మిలిటరీ చెక్ పోస్టు (Militery check point)పై టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావీన్స్ (Baloochisthan praveence) రాజధాని క్వెట్టాకు 150 కిలోమీటర్ల దూరంలోని పర్వత కలాత్ (Parvatha kalath) జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్టు పోలీసు అధికారి హబీబ్-ఉర్-రెహ్మాన్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. గాయపడిన 18 మంది సైనికులను ఆస్పత్రికి తరలించగా వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ దాడికి వేర్పాటు వాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత వహించింది. చెక్ పోస్టుపై దాడి చేసింది తామేనని తెలిపింది. ఈ ఘటనను ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఇటీవల బీఎల్ఏ తన దాడులను తీవ్ర తరం చేసింది. గతవారం ఓ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా పలువురు జవాన్లతో సహా 27 మంది మరణించారు. వరుస ఘటనల నేపథ్యంలో బలూచిస్థాన్ ప్రావీన్సులో ఆందోళనలు నెలకొన్నాయి.