- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్వే వివరాలను ట్రంకు పెట్టెలో భద్ర పరచండి
దిశ, మేడ్చల్ బ్యూరో : సర్వే వివరాలను ట్రంకు పెట్టెలో భద్ర పరచాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం, పూడురులో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రతిరోజూ ఎన్యుమరేటర్లు పూరించిన ప్రొఫార్మాలను గ్రామపంచాయతీ లేదా మండల కార్యాలయాల్లో ట్రంక్ పెట్టెలో జాగ్రత్తగా భద్రపరచాలని, ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించమని ఎంపీడీఓలను హెచ్చరించారు.
ఎన్యుమరేటర్ల నమోదు ప్రక్రియ పూర్తైన వెంటనే ఆపరేటర్ల ద్వారా కంప్యూటర్లలో అప్ లోడ్ చేయించాలని సూచించారు. ప్రొఫార్మాల నమోదులో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని, ఎన్యుమరేటర్లు పూరించిన ప్రొఫార్మాలను సూపర్ వైజర్లు, నోడల్ అధికారులు తప్పకుండా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
శామీర్ పేటలో..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా శామీర్ పేట్ మండలంలోని శామీర్ పేట్ లో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణను శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పరిశీలించారు. కుటుంబ వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలన్నారు. ప్రొఫార్మాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.