- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేటీఆర్ కుట్రలతోనే కలెక్టర్ పై దాడి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి సొంత జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో..భూ సేకరణ చేస్తుంటే కేటీఆర్,హరీష్ రావు లు కుట్రలు చేసి వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయించడం హేయమైన చర్య అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతం 75 ఏళ్ళలో కాని అభివృద్ధి ఇప్పుడు ప్రారంభమై,ఎంతో అభివృద్ధి చెంది యువతకు ఉపాధి,ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే అక్కసుతో అభివృద్ధి వైపు వెళుతుంటే..కల్వకుంట్ల కుటుంబం అడ్డుకుంటూ కుట్రలు చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. పాలమూరు నుంచి కేసిఆర్ రాజకీయ ప్రస్థానం మొదలై,ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఆయన జోస్యం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు చెమటను నమ్ముకొని బతుకుతున్నారని,అలాంటి వారి కడుపు కొట్టడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత,సిరాజ్ ఖాద్రీ,సిజె.బెనహర్,మహేందర్,నాగరాజు,కేసీఆర్,రఘుపతి,తదితరులు పాల్గొన్నారు.
ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టండి...
జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికాకేటీఆర్ కుట్రలతోనే కలెక్టర్ పై దాడిరులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి మైనింగ్,మున్సిపల్,రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులు,ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి సంజీవ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,డిఇ బస్వరాజు,తదితరులు పాల్గొన్నారు.