Actress Jethwani case: కుక్కల విద్యాసాగర్‌కు మరోసారి ఎదురుదెబ్బ

by srinivas |
Actress Jethwani case: కుక్కల విద్యాసాగర్‌కు మరోసారి ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి జెత్వాని కేసు(Mumbai Actress Jethwani case)లో నిందితుడు కుక్కల విద్యాసాగర్‌(Kukkala Vidyasagar )కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌ను విజయవాడ సీఐడీ కోర్టు(Vijayawada CID Court) కొట్టివేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ముంబై నటి జెత్వానిని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కుల విద్యాసాగర్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఐడీ కోర్టులో విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కేసు విచారణలో ఉండగా విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపున వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed