- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదల ఇళ్ల కూల్చివేతల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేరు
దిశ, మేడ్చల్ బ్యూరో/జవహర్ నగర్ : రేవంత్ రెడ్డికి పేదల ఇళ్లు కూల్చివేసే ముఖ్యమంత్రిగా పేరు ఉందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటి వరకు సర్కారు చేసిన పిచ్చి పనులు చాలన్నారు. మీరు అనుకున్న అందమైన నగరానికి, రోడ్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల బతుకులు నాశనం చేసి రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నాయకులు చెప్పారు కదా ...అని అధికారులు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే సహించమన్నారు. శనివారం మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భూములు నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీ నగర్, జవహర్ నగర్ లో 60 ఏళ్ల క్రితం మాజీ సైనికులకు భూములు ఇస్తే వారు ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు వేశారని తెలిపారు. ఆయా లే అవుట్లలో రెక్కల కష్టం మీద బతికే పేదవాళ్లు కొనుక్కున్నారని, జవహర్ నగరంతా ప్రభుత్వ పరమైన భూమి అని అక్రమంగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్నారని అనడం తప్పన్నారు. ఇవి ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇచ్చిన భూములు తప్ప ప్రభుత్వ పరమైన భూములు కావని స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదలు భయపడుతున్నట్లు తెలిపారు.
దుర్మార్గులు ఎప్పుడు వచ్చి కూల్చివేస్తారో, ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయంతో బతుకుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కున్న భూమిని మళ్లీ అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని ఎల్ఆర్ఎస్ కింద డబ్బులు కట్టిన వారు కూడా ఉన్నారని తెలిపారు. జీవో నెంబర్ 58, 59 లో అనేకమంది డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ పేదలకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం తాము కూల్చి వేస్తాం దిక్కున్న చోట చెప్పకో అని అహంకారపూరితంగా మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికే హైడ్రా, మూసీనది ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు కూలగొట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.