- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG-TET: టెట్ అభ్యర్థులకు విద్యా శాఖ అలెర్ట్.. అప్లికేషన్ ఎడిట్ కు ఛాన్స్
దిశ, వెడ్ డెస్క్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(Teacher Eligibility Test)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యా శాఖ(Education Department) అలెర్ట్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ(Application Process)లో తప్పుల సవరణ(Correction)కు అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఇటీవల టెట్ నోటిఫికేషన్(Tet Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టెట్ కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలోనే అప్లికేషన్లలో అభ్యర్థులు చేసే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్(School Education Department) అవకాశం కల్పించింది.
ఈ మేరక్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి 22 వ తేదీ వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లను ఎడిట్(Edit Option) చేసుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ తప్పుల సవరణను www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 7032901383, 9000756178 నంబర్లను సంప్రదించాలని తెలిపింది. కాగా దరఖాస్తుల ప్రక్రియకు ఈ నెల 20 చివరి తేదీగా ప్రకటించింది. గత మే లో జరిపిన టెట్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులు కానీ వారికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహిస్తారని.. ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను విడుదల చేస్తారని నోటిఫికేషన్ లో తెలిపింది.