- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. వైద్య విద్యార్థులు, డాక్టర్ సస్పెండ్
by Bhoopathi Nagaiah |
X
దిశ, నల్లగొండ బ్యూరో : నల్లగొండ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిలను ర్యాగింగ్ చేశారని ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అందులో రెండవ సంవత్సరం విద్యార్థిని ఒక నెల, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. చాలాకాలంగా మెడికల్ కాలేజీలో విద్యార్థినిల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ కాలేజీ అధ్యాపక బృందం గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత నల్లగొండ జిల్లాలో ర్యాగింగ్ పేరు మొదటిసారిగా వినబడింది. ఇప్పటికైనా కాలేజీలలో ఇలాంటి వేధింపులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Advertisement
Next Story