- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Actor Govinda : అస్వస్థతకు గురైన ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా(Actor Govinda) శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా జల్గావ్ రోడ్ షోలలో గోవిందా పాల్గొన్నారు. అయితే, సాయంత్రం ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబయికి చేరుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. రోడ్‌షోలో ప్రధాని నరేంద్ర మోదీకి అండగా నిలవాలని.. బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను గోవింద రోడ్‌షోలో కోరారు. గోవిందా కాంగ్రెస్‌కు చెందిన మాజీ లోక్‌సభ ఎంపీ అయినప్పటికీ.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఇటీవల తుపాకీ కారణంగా గోవిందా గాయపడగా.. మరోసారి అస్వస్థతకు ఆయన గురికావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.