Kalologi Health University: బీఎస్సీ నర్సింగ్ మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీ

by Ramesh Goud |
Kalologi Health University: బీఎస్సీ నర్సింగ్ మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్సీ నర్సింగ్(BSc Nursing) మేనేజ్ మెంట్ కోటా అడ్మిషన్ల(Management Quota Admissions) ప్రాసెస్ మొదలైంది. శనివారం కన్వీనర్ కోటా(Convenor Quota) మాప్ ఆప్ పూర్తి కావడంతో, మేనేజ్ మెంట్ కోటాకు అవకాశం ఇచ్చారు. 2024–25 అకాడమిక్ ఇయర్ కు సీట్లను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (4 ఇయర్స్) కోర్సుకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రూల్స్(Indian Nursing Council Rules) పాటిస్తూ మేనేజ్ మెంట్ కోటా లో సీట్లను భర్తీ చేసుకోవచ్చని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ(Kalologi Health University) శనివారం అన్ని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల(Private Nursing Colleges) ప్రిన్సిపాల్స్ కు ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిషన్ పొందిన విద్యార్ధులు వివరాలు ఈ నెల 25 లోపు వర్సిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. డీడీ రూపంలో పేమెంట్లకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఫీజు చెల్లిస్తే, ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడదని వర్సిటీ రిజిస్టార్(Registrar) స్పష్టం చేశారు. అడ్మిషన్ వివరాలను [email protected] కు పంపించాలని కోరారు. ఈ నెల 25 తర్వాత వివరాలు పంపితే పరిగణించబడదు. ఈ నెల 30 తర్వాత ఫీజు చెల్లిస్తే కన్సిడర్ చేయమని యూనివర్సిటీ(University) పేర్కొన్నది. నాలుగేళ్ల కోర్సుకు యూనివర్సిటీకి ఒక్కో విద్యార్ధి పది వేలు చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్(కాంపొటెంట్) కోటాలో మేల్ క్యాండియేట్లు సీట్లు లభిస్తేనే, మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ చేయాలని వర్సిటీ నొక్కి చెప్పింది.

సర్క్యూలర్ కన్ ప్యూజ్..?

బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లపై కాళోజీ వర్సిటీ ఇచ్చిన సర్క్యూలర్ కన్ ప్యూజ్ గా ఉన్నదని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్ చెప్తున్నారు. ఈ ఏడాది బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను ఇంటర్ తోనూ భర్తీ చేసుకోవచ్చని సెప్టెంబరులో హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారు. బైపీసీ కోర్సులో జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్ధులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీ స్టూడెంట్స్ 40 శాతం చొప్పున మార్కులు పొందాలని పేర్కొన్నారు. అయితే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన సీట్లకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కానీ కొత్తగా మేనేజ్ మెంట్ అడ్మిషన్ల కోసం ఇచ్చిన సర్క్యూలర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో విద్యార్దులతో పాటు కాలేజీల అధికారులు, యాజమాన్యాల్లోనూ కాస్త కన్‌ప్యూజన్ నెలకొన్నది. ఇదే అంశంపై క్లారిటీ తీసుకునేందుకు వర్సిటీ వీసీ, రిజిస్టార్ లకు ఫోన్ చేయగా, వాళ్లు లిప్టు చేయలేదు. కానీ కన్వీనర్, మేనేజ్ మెంట్ కోటా మాప్ ఆప్ పూర్తి అయిన తర్వాత మిగిలి పోయిన సీట్లకు‘లెప్ట్ ఓవర్ కోటా ’ ద్వారా భర్తీ చేస్తారని వర్సిటీ కి చెందిన ఓ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఆఫ్​ ది రికార్డులో చెప్పారు. ఈ ఏడాది 5 సెప్టెంబరు న రిలీజ్ చేసిన జీవో లో లెప్ట్ ఓవర్ కోటాపై స్పష్టత ఇచ్చారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed