- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎదురులేని భారత్.. అమ్మాయిల జట్టుకు వరుసగా నాలుగో విజయం
దిశ, స్పోర్ట్స్ : ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీలో ఎదురున్నదే లేకుండా జైత్రయాత్ర చేస్తున్న భారత్ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బిహార్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో చిత్తు చేసింది. చైనా ఒక్క గోల్ కూడ చేయకపోవడం గమనార్హం. ఇరు జట్లు ఆరంభంలో గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చైనా నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న భారత్.. మొదట్లో గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఫస్టాఫ్‌లో ఏ జట్టు గోల్ చేయలేకపోయింది.
సెకండాఫ్‌లో భారత అమ్మాయిలు దూకుడు పెంచారు. 32వ నిమిషంలో సంగీత జట్టుకు తొలి గోల్ అందించింది. కాసేపటికే 37వ నిమిషంలో టెటె సలిమా చేసిన గోల్‌తో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి పట్టు సాధించింది. అదే సమయంలో చైనాను గోల్ చేయకుండా అడ్డుకుంది. ఇక, ఆఖరి నిమిషంలో దీపిక గోల్ చేయడంతో భారత్ 3-0 ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో భారత జట్టు.. చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే భారత అమ్మాయిలు సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం చివరి గ్రూపు మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.