Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే కారణం.. ఆప్ మంత్రి గోపాల్ రాయ్

by vinod kumar |
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యానికి బీజేపీ పాలిత రాష్ట్రాలే కారణం.. ఆప్ మంత్రి గోపాల్ రాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ పాలిత రాష్ట్రాలే దేశ రాజధానిలో కాలుష్యానికి కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) నేత, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Roy) ఆరోపించారు. బీఎస్ 4 డీజిల్ బస్సులపై నిషేధం ఉన్నప్పటికీ హర్యానా(Haryana), ఉత్తరప్రదేశ్ (Uthara pradesh) రాష్ట్రాలు వాటిని ఢిల్లీకి పంపుతున్నాయని, తద్వారా కాలుష్య సమస్య తీవ్రం అవుతోందని మండిపడ్డారు. ఈ బస్సులు జీఆర్ఏపీ III మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని తెలిపారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను ఢిల్లీ ప్రభుత్వ రవాణా విభాగానికి చెందిన అధికారులు బస్సులకు చలాన్లు సైతం జారీచేశారన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆప్ ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంటే పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. సమస్యను మరింత తీవ్ర తరం చేయడానికే బీజేపీ ఉద్దేశ పూర్వకంగా రూల్స్ ఉల్లంఘించి బ్యాన్ చేసిన డీజిల్ బస్సు రాజధానికి పంపిస్తోందని నొక్కి చెప్పారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) నివేదిక ప్రకారం.. ఢిల్లీ వాయు కాలుష్యంలో 70 శాతం కారకాలు బయటనుంచే వస్తున్నాయని, పొరుగు రాష్ట్రాలు ఈ సమస్యను పెంచడానికి ఎంతో దోహద పడుతున్నారని తెలిపారు. కాగా, ఢిల్లీలో కాలుష్య సమస్య ఎక్కువైన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 450కిపైగా నమోదవుతోంది.

Advertisement

Next Story

Most Viewed