KTR: బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రా? రేవంత్ రెడ్డికి సహాయ మంత్రా?: కేటీఆర్

by Prasad Jukanti |   ( Updated:2024-11-16 10:21:30.0  )
KTR: బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రా? రేవంత్ రెడ్డికి సహాయ మంత్రా?: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: 'మూసీ మే లూటో... ఢిల్లీ మే బాటో' అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm Revanth Reddy) తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ ఫినిష్ చేస్తామన్నారు. ఓ సారి చరిత్రలోకి తొంగు చూడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ (KCR) ను ఫినిష్ చేస్తామన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుస్తుందన్నారు. వాళ్లతోనే కాలేదు. నువ్వు ఎంత? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంకో ఓ శక్తి అని, ఆయనే ఈ తెలంగాణను తీసుకురాకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి సీటు సీటు ఉండేదా అని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్ తమ అనుచరులతో కలిసి శనివారం కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో భవన్ (Telangana Bhavan) లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దేవుళ్ల పేరుతో ఒట్టు వేసి దేవుళ్లను సైతం మోసం చేసిన మొదటి వ్యక్తి అని అని విమర్శించారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిందని ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదన్నారు.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సిగ్గుందా?:

మూసీ (Moosi Project) పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నస్తున్నాడని మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించామని కేటీఆర్ అన్నారు. 40, 50 ఏళ్ల నుంచి ఉన్న మీ భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్స్ లు కట్టించుకొని కబ్జాదారులు అంటారా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు స్పందించి మూసీ పక్కన పండుకుంటామని చెప్పడం చాలా సంతోషం అన్నారు. మూసీని బీఆర్ఎసే మురికి కూపం చేసినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని నిజానికి మూసీ మురికి కూపం కావటానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం అన్నారు. మహత్మా గాంధీని విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదన్నారు. మూసీ మూటల్లో మీ వాటా ఎంత? అని నిలదీశారు. నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్ లు పుట్టుకొస్తారని ఇప్పడే పోరాటం మొదలైంది. మరో నాలుగేళ్లు ఈ కాంగ్రెస్ తో పోరాటం చేయాల్సి ఉందన్నారు. ప్రకాష్ గౌడ్, అరికేపుడి గాంధీలకు (Arikepudi Gandi) సిగ్గుందా? ఏ పార్టీ లో ఉన్నారో చెప్పే దమ్ముందా? రాజేంద్రనగర్ లో ఉప ఎన్నిక రావటం ఖాయం అన్నారు. ప్రకాశ్ గౌడ్ (Prakash Goud) పార్టీ మారి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని పైరవీల కోసం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ మారినప్పటికీ పార్టీ కోసం కార్యకర్తలు బలంగా నిలవటం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనకు కూడా వచ్చాయి. కానీ వాటిని మనం గట్టిగా ఎదుర్కోవాలన్నారు. 2000 సంవత్సరంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని 24 ఏళ్లలో ఇంతింతై వటుండింతే అన్నట్లుగా రాష్ట్రం నలుమూలలా బీఆర్ఎస్ బలంగా మారిందన్నారు.

రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు?:

కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోడీ(Modi) అన్నారు. మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మేము అమృత్ టెండర్ల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారారని విమర్శించారు. మేము రేవంత్ రెడ్డి ని తిడితే బీజేపీ ఎంపీలకు రోషం వస్తోందని, బండి సంజయ్, రఘనందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్వింద్ లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అసలు వాళ్లు బీజేపీ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? లేక రేవంత్ బీజేపీలో ఉన్నాడా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed

    null