Breaking News : దేశంలోనే తొలి మహిళా బస్ డిపో

by M.Rajitha |
Breaking News : దేశంలోనే తొలి మహిళా బస్ డిపో
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం(Delhi AAP Govt) మరో సరికొత్త విధానానికి నాంది పలికింది. మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి మహిళా సిబ్బందితో మాత్రమే నడిచే మహిళా బస్ డిపో(Women Bus Depot)ను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని సరోజిని నగర్లో ఈ మహిళా బస్ డిపోను మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gehlath) శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం సిబ్బంది మహిళలే పనిచేయనున్నారు. ప్రస్తుతం ఈ డిపోలో 225 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story