భక్తులు అప్రమత్తంగా ఉండండి.. సైబర్ నేరాలు జరగొచ్చు

by Ramesh Goud |
భక్తులు అప్రమత్తంగా ఉండండి.. సైబర్ నేరాలు జరగొచ్చు
X

దిశ వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు ప్రజల అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ చేతి వాటం చూపిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రేచ్చిపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. రామ మందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారని, ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతుండటంతో, దీన్ని సైబర్ నేరస్థులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తాజాగా సైబర్ నేరాలపై అలర్ట్ ప్రకటించారు. ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్ లను, మెయిల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, రామమందిర విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్ లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫోన్లకు వచ్చే లింక్ లను తెలియక ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పేరుతోనూ సైబర్ నేరాలు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed