- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింప్లిసిటీ ప్రదర్శించిన డిప్యూటీ CM భట్టి.. సామాన్యుల వలే RTC బస్సులో జర్నీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సామాన్యుల వలే ఆర్టీసీ బసులో ప్రయాణించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి.. ఈ సందర్భంగా ఖమ్మం నుండి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత బస్సు జర్నీ స్కీమ్ అమలుపై ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణం స్కీమ్ పట్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి ఎంతైనా ఖర్చు పెడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లోనే ఉందని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ స్కీమ్‌ను అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా అమలు అవుతోంది.