- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోయే MP సీట్లు ఇవే.. తేల్చి చెప్పిన భట్టి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక, జూన్ 4వ తేదీన ఫలితాలు వెలవడనున్నాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని ఈ సందర్భంగా భట్టి జోస్యం చెప్పారు.
కేంద్రంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమినే అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యత్నించాయని పరోక్షంగా బీజేపీపై ఫైర్ అయ్యారు. కానీ దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇండియా కూటమి వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మిషన్ 15 టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. కనీసం 14 సీట్లులో గెలుపొందేలా ఎన్నికల బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.