Deputy CM Bhatti Vikramarka: వారంలోగా సమస్యకు పరిష్కారం చూపండి

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti Vikramarka: వారంలోగా సమస్యకు పరిష్కారం చూపండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy), శ్రీధర్ బాబు(Sridhar Babu) పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం(Deputy CM Bhatti Vikramarka) ఆదేశించారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు(Special Chief Secretary K. Ramakrishna Rao) అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ సమావేశమై వారంలోగా సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కాలుష్యం సమస్య ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తాము నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) బయటకు వెళ్తామని సబ్ కమిటీకి విజ్ఞప్తులు చేశారు. పరిశ్రమల యజమానుల విజ్ఞప్తులు పరిశీలించి వారు ఓఆర్ఆర్(Outer Ring Road) బయట పరిశ్రమలు స్థాపించి ముందుకు వెళ్లేలా సహకరించండి, పరిశ్రమలను ప్రోత్సహించాలని హైదరాబాద్ నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను సబ్ కమిటీ సభ్యులు ఆదేశించారు.

మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియపై సబ్ కమిటీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ముందుగా కొంత భాగాన్ని వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఐదెకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని అధికారులకు వివరించారు. సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు మినిట్స్ రూపంలో నమోదు చేయాలని, మరో వారంలో జరిగే సమావేశానికి అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed