- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులతో సచివాలయం వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్(JOB Notification) ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులను పూర్తి చేశామని గుర్తుచేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వరదల సమయంలో తీవ్రంగా శ్రమించిన విద్యుత్ సిబ్బందిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి అభినందించారు.
రాష్ట్రంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్స్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దసరా పండుగ కంటే ముందే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని అన్నారు. హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలని పాటుపడుతుంటే, అసత్య ప్రచారాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, తొలగించిన ఇళ్లకు బదులు మరో చోట ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.