- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ వార్త చిత్రం పోటీల గోడ పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం ఏటా నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఉత్తమ వార్త చిత్రం పోటీల గోడ పత్రికను హైదరాబాద్‌లో బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ.. న్యూస్ ఫోటో కాంటెస్ట్‌లో పాల్గొనడం వలన పత్రిక ఫోటోగ్రాఫర్‌లకు, ముఖ్యంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, న్యూస్ ఫోటోగ్రఫీ సంఘంలో గుర్తింపు పొందాలని చూస్తున్న వారికి అనేక ప్రయోజనాలు పొందుతారని తెలిపారు.ఈ పోటీలో పాల్గొనడం అనేది తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతర ప్రతిభావంతులైన పత్రిక ఫోటోగ్రాఫర్‌లతో పోటీ పడడం వలన కొత్త టెక్నిక్‌లను ప్రయత్నించడానికి, విభిన్న శైలులతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సవాళ్లను స్వీకరించడానికి ప్రేరేపిస్తాయని భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి మాట్లాడుతూ.. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు నెలలో గత 30 సంవత్సరాల నుండి ఫోటో జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్త ఉత్తమ వార్త చిత్రం పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది ఫోటో జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొంటారని.. 2024 - 2025 సంవత్సరం ఉత్తమ వార్త చిత్రం పోటీలలో గెలిచిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.10000 /- , ద్వితీయ బహుమతి రూ.8000 /-, తృతీయ బహుమతి రూ. 5000 /- లతోపాటు రూ. 2000 /- 25 కన్సోలేషన్ బహుమతులు ఉంటాయన్నారు. అలాగే వీటితోపాటు సర్టిఫికెట్, మెమెంటోలను కూడా అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల ఫోటో జర్నలిస్టులు పోటీలలో పాల్గొనడానికి మూడు 8 x 12 సైజు కలర్ లేదా బ్లాక్ & వైట్ ఫోటోలను టిఎస్‌పిజెఏ కార్యాలయం, టియుడబ్ల్యూజె బిల్డింగ్, దేశోద్ధారక భవన్, బషీర్ బాగ్, హైదరాబాద్‌కు పంపగలరు. ఆఖరు తేదీ ఆగష్టు10 , 2024 ఈ కార్యక్రమంలో టిఎస్‌పిజెఏ రాష్ట్ర నేతలు నగర గోపాల్, అలీముద్దీన్, హరి ప్రేమ్, ఆనంద్ ధర్మాన, వి. రజనీకాంత్, సుమన్ రెడ్డి, శివ కుమార్, అశోకుడు తదితరులు పాల్గొన్నారు.