- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti Vikramarka: నిరుద్యోగులకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క మరో గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో తీపి కబురు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఆన్ లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కోచింగ్ ఇచ్చేందుకు విషయ నిపుణులను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్‌లో పాఠాలు బోధిస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను ఆయా కేంద్రాల్లోనే డౌట్స్ క్లియర్ చేస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా, వచ్చే నెలలో జరగనున్న గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేయడంతో పాటు గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులు.. ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. నిరుద్యోగులతో ఆయన చర్చలు జరిపారు. అనంతరం మీడియతో మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తామని అభ్యర్థులకు హామీ ఇచ్చారు. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామన్నారు.
నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్-2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని గుర్తు చేశారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని పునర్ఘాటించారు. గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని.. ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.