Bhatti Vikramarka : ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించేలా ప్లాన్.. మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి వరాల జల్లులు

by Ramesh N |   ( Updated:2024-10-27 09:36:13.0  )
Bhatti Vikramarka : ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించేలా ప్లాన్.. మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం భట్టి వరాల జల్లులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మహిళల ఆర్థికాభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, ఎస్‌బీఐ బ్యాంకు, భోజనశాల, బస్‌స్టాప్‌లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను Deputy CM రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక శాసనసభలో ప్రమాణం చేసిన అరగంటలోనే ఆలస్యం అవుతుందని అసెంబ్లీలోకే ఆర్టీసీ బస్సులను తెప్పించి మహిళలకు ఉచిత బస్సు రవాణా ప్రారంభించామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగిస్తున్నారని, ఆ టికెట్‌లకు అయ్యే ఖర్చు ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు ఆర్టీసీ డబ్బు కడుతోందని స్పష్టంచేశారు.

ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు నిధులు టార్గెట్

ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆర్థికంగా బలపడడానికి కుటుంబమంతా బలపడుతోందన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబడేటట్లు చేయాలని దాని కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్ని వేల కోట్లన Dwakra Women మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాని కోసం మహిళలు కోట్లలో ఉన్నారు.. కాబట్టి ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతామని, మొదటి సంవత్సరం రూ. 25 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించేలా ప్లాన్

ఆర్టీసీలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో బస్సు యజమానులుగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులు మారనున్నారని అన్నారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించేలా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. ఆ బస్సులను ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి, దాని ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెచ్చి మహిళలను భాగస్వాములు చేయాలని నివేదికలు తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో మహిళ ఇండస్ట్రియల్ పార్క్

ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న women's groups మహిళలకు రుణాలు ఇప్పించి.. ఈ లక్ష కోట్లకు కూడా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వడ్డీ కడుతుందని, మీరు ఎవరు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మీరు తీసుకున్న డబ్బుతో పెట్టుబడులు, వ్యాపారం చేయాలని సూచించారు. వ్యాపారం చేయడం తెలియక పోతే.. ఐకేపీ సిబ్బందితో ట్రైనింగ్ క్లాస్‌లు ఏర్పాటు చేసి.. వ్యాపారం చేసే అనుభవజ్ఞులతో ట్రైనింగ్ ఇప్పించి వ్యాపారం చేయిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా నిలబడాలనేది తమ కోరిక అని, ఈ క్రమంలోనే వారికి అన్ని సహాయ సహకారం అందించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని మహిళలకు వివరించాలని, ఐకేపీ సిబ్బంది, అధికారులదే బాధ్యత అని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed