- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA లాస్యనందిత అకాల మరణం ఎంతో బాధకరం: డిప్యూటీ CM భట్టి
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారు పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ లాస్య ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. లాస్య నందిత అతిపిన్న వయసులో ప్రజామన్ననలు పొంది ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మరోవైపు లాస్య మృతదేహాన్ని పటాన్ చెరు నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి దేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లాస్య ఇంటికి వెళ్లనున్నారు.
Read More : MLA లాస్యను వెంటాడిన మృత్యువు.. 60 రోజుల్లో మూడు ప్రమాదాలు.. ఇవాళ మృతి..!