- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగుపాటుకు.. కరెంట్‌షాక్ తగిలి డిగ్రీ విద్యార్థి మృతి
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా నస్రుళ్లబాద్ మండలం నాచుపల్లి లో తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. శనివారం సాయంత్రం సమయంలో జిల్లాలో పిడుగు పడింది. దీంతో కరెంట్ షాక్ కు గురై 18 సంవత్సరాల స్వాతి అనే డిగ్రీ విద్యార్థిని తన ఇంట్లోనే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు స్వాతి ఇంటి వెనుకనున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఆ చెట్టుకు ఆనుకొని ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయి.. స్వాతి ఇంటిపై పడ్డాయి. మృతురాలు స్వాతి ఇల్లు పూర్తిగా రేకుల ఇల్లు కావడంతో.. తలుపు తీయడానికి ప్రయత్నించగానే.. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి స్వాతి అక్కడిక్కడే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా నాచుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story